వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ గెటప్ ఛేంజ్..

పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ చిత్రీకరణని త్వరగా ముగించేయాలని చూస్తున్నాడు. కరోనా కారణంగా ఆరున్నర నెలల పాటు వాయిదా పడ్డ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఐతే పవన్ కళ్యాణ్ మాత్రం నిన్ననే జాయిన్ అయ్యాడు. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ కోసం నవంబరు నెల మొత్తం కేటాయించాడని టాక్. టాకీ పార్ట్ మొత్తం నవంబరులో పూర్తి చేయాలని చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ ప్లాన్ చేస్తున్నాడు.

కోర్టు డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రత్యేకమైన కోర్టు సెట్ ని నిర్మించారట. అందులోనే సినిమాలోని కీలక సన్ని వేశాలు తెరకెక్కనున్నాయి. ఇన్నాళ్ళు జనంలో ఉండి గడ్డంతో కనబడ్డ పవన్ కళ్యాణ్, సడెన్ గా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. గడ్డం తీసేసి వకీల్ సాబ్ కోసం రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న వకీల్ సాబ్ సంక్రాంతికి థియేటర్లలో వచ్చే అవకాశం ఉంది.