నిహారిక కంటే నితిన్‌ కే విలువిచ్చిన పవన్… రెండు ప్రశ్నలు!!

-

నవ్వుల స్టార్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమలో చిరంజీవి, రామ్‌ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ దంప‌తులతోపాటు.. సాయి ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్ తేజ్ త‌దిత‌ర కుటుంబ స‌భ్యులు కూడా హాజ‌ర‌య్యారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… పవన్ కల్యాణ్ మాత్రం హాజరుకాలేదు. దీంతో పవన్ అభిమానులు ఇరకాటంలో పడిపోతున్నారు!

గతకొన్ని రోజులుగా నాగబాబు – పవన్ ల మధ్య కాస్త గ్యాప్ ఉందనే కథనాలు వస్తోన్న తరుణంలో… ఈ కార్యక్రమం వాటికి మరింత బలం యాడ్ చేసిందనే కామెంట్లు పడుతున్నాయి. ఈ క్రమంలో… ప‌వ‌న్‌ క‌ల్యాణ్ చాతుర్మాస్య దీక్ష‌లో ఉండ‌డం వ‌ల్లే నిశ్చితార్థానికి రాలేకపోయి ఉంటారని అభిమానులు సమర్ధించే పనికి పూనుకున్నప్పటికీ… ఆ సమర్ధనకు రెండు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

వాటిలో ఒకటి… నిజంగా పవన్ చాతుర్మాస్య దీక్షలోనే ఉండి ఉంటే… ఇటీవ‌ల హీరో నిత‌న్ పెళ్లికి వెళ్లి ఆశీర్వ‌దించ‌ లేదా? అనేది ఒక ప్రశ్న కాగా… పోని పవన్ కు ఏదైనా ఇంతకంటే ముఖ్యమైన పని ఉంటే… కనీసం భార్య పిల్లలను అయినా పంపి ఉండాల్సింది కదా? అనేది మరో ప్రశ్న! మరి వీటిపై పవన్ వైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తోంది అనేది ఆసక్తిగా మారింది!

Read more RELATED
Recommended to you

Latest news