హాట్ టాపిక్ గా ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌.. ఇదీ అస‌ల క‌థ‌!

ప‌వ‌న్ క‌ల్యాన్ అంటే తెలుగు ఇండ‌స్ట్రీలో టాప్ హీరో. బేసిక్ గా ఇలాంటి హీరోల‌పై అనేక రూమ‌ర్స్ ఉంటాయి.అది స‌హ‌జ‌మే. మ‌రీ ముఖ్యంగా ఇలాంటి స్టార్ హీరో సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది అంటే దాని చుట్టూ అనేక గాసిప్స్ న‌డుస్తుంటాయి. ఇక ఇప్పుడు ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన విష‌యం తెల‌సిందే. ఇక దీనిపై చాలానే రూమ‌ర్స్ వ‌చ్చాయి.


అయితే లేటెస్టుగా ఓ విష‌యం గురించి టాలీవుడ్ లో విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. సినీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ప‌వ‌న్ ఈ సినిమాకు ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడు అనే దాని గురించి. ప‌వ‌న్ కు ఉన్న మార్కెట్ ప‌రంగా 30 నుంచి 45కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌డానికి మామూలుగానే ఏ నిర్మాత అయినా రెడీగా ఉంటాడు.
తాజాగా వ‌కీల్ సాబ్ కు ప‌వ‌న్ క‌ల్యాన్ రూ.50 కోట్లు తీసుకున్నాడ‌ని, అలాగే.. సినిమా పెద్ద విజ‌యం సాధించ‌డంతో లాభాల్లో మరో రూ.15 కోట్లు ఇలా రూ.65 కోట్ల వ‌ర‌కు ప‌వ‌ర్ స్టార్ తీసుకున్నాడ‌ని చ‌ర్చ న‌డుస్తోంది. కానీ ఇవ‌న్నీ రూమ‌ర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ లో ఇంత పెద్ద మొత్తంలో ఏ హీరోకు ఇవ్వ‌లేదు. ఇక సినిమా ప‌రంగా చూస్తే కొవిడ్ కార‌ణంగా పెద్ద‌గా వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేదు. మ‌ధ్య‌లోనే సినిమా ఆగిపోయింది. పెద్ద‌గా లాభాలు కూడా రాలేదు. మ‌రి అలాంట‌ప్పుడు అన్ని కోట్లు ఎలా ఇస్తారు. అందుకే ఇవ‌న్నీ రూమ‌ర్ గా మిగిలిపోయాయి.