తెలంగాణ గ్రూపు-1 కి లైన్ క్లియర్

-

తెలంగాణ గ్రూపు-1 కి లైన్ క్లియర్ అయిందనే చెప్పవచ్చు. గ్రూపు 1 పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు లో రిట్ అపిల్ వేశారు. ఇవాళ విచారణ చేపట్టిన అనంతరం కొట్టి వేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. దీంతో ఈ నెల 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది.

మరోవైపు సుప్రీం కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఈ కేసును సోమవారం విచారణ చేపడుతామని వెల్లడించారు. సోమవారం మొదటి కేసు గా విచారణ జరుపుతామని పేర్కొంది. అదేరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష ఉండటం గమనార్హం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ లో గత రెండు, మూడు రోజుల నుంచి గ్రూపు 1 అభ్యర్థులు నిరసన తెలుపుతుండటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారు. జీవో నెం.29ని రద్దు చేసి.. జీవో నెం.55 ప్రకారమే గ్రూపు 1 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులు. సుప్రీంకోర్టు తీర్పు పై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news