ప్రజెంటేషన్ పేరుతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి పరువు తీసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో తాజాగా మూసీ పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న అన్ని అబద్దాలు చెప్పారన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని సెటైర్లు వేశారు. తన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
రూ.లక్షన్నర కోట్ల దోపిడిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మూసి నది నగరంలో 57 కిలోమీటర్లు ప్రవహిస్తుందని.. 70 శాతం పారిశ్రామిక వ్యర్థాలు మూసీలో కలుస్తాయన్నారు. నగరంలోని ప్రతీ వాన చినుకు మూసీలోనే కలుస్తుంది. మేము మూసీని కరకట్టలతో కాపాడాలనుకున్నామని తెలిపారు. మూసీలోకి గోదావరి జలాలలను తెప్పించాలనుకున్నాం. కానీ రేవంత్ సర్కార్ మూసీని పురిట్లోనే చంపే ప్రయత్నం చేస్తోందన్నారు. మూసీని మురికి కుంపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీలే అన్నారు. రేవంత్ రెడ్డి నల్గొండ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు కేటీఆర్.