OG మూవీ కోసం మరోసారి పాట పాడనున్న పవర్ స్టార్

-

పవన్‌ కల్యాణ్ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ పాట పాడనున్నారా అంటే సంగీత దర్శకుడు తమన్‌ చెప్పిన మాటలు వింటుంటే అవుననే సమాధానమే కనిపిస్తోంది. ‘‘ఓజీ’ స్క్రిప్ట్‌ ప్రకారం పవన్‌తో పాట పాడించే ఆస్కారం ఉందని.. ప్రస్తుతం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నామని తమన్ అన్నారు.

ఈ వార్త కాస్త ప్రస్తుతం నెట్టింట సెన్సేషన్ అవుతోంది. మరోసారి థియేటర్లలో పవన్‌ పాట వినొచ్చని ఫ్యాన్స్‌ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా.. అజ్ఞాతవాసి మూవీలో కొడకా కోటేశ్వర్రావు అంటూ పవన్ కల్యాణ్ పాడిన పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. జపాన్‌ – ముంబయి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా కనిపించనున్నారు. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news