వీడియో: ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న కొడుకును చూశారా.. ఎంత ముద్దుగున్నాడో..!!

-

టాలీవుడ్ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ కి రెండో కొడుకు పుట్టిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. మ‌రోవైపు పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ పవనో విచ్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ‌ హల్ చల్ చేస్తున్నారు. తమకో బుల్లి పవర్ స్టార్ దొరికేశాడంటూ మెగా ఫ్యాన్స్ ఇప్పుడు తెగ ఆనందపడిపోతున్నారు. పవన్ కల్యాణ్, లెజినోవా దంపతుల కుమారుడు మార్క్ శంకర్ పవనో విచ్, తెల్లని కుర్తా పైజమా ధరించి, సందడి చేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

క్యూట్ గా కనిపిస్తూ, చూస్తున్న అందరి హృదయాలనూ కొల్లగొట్టేలా కనిపిస్తున్నాడీ బుల్లి హీరో. కుర్తాపై జనసేన పార్టీ లేబుల్ కూడా కనిపిస్తోంది. ఈ లిటిల్ పవర్ స్టార్ ముఖంలో అటు పవన్, ఇటు లెజినోవా పోలికలు కనిపిస్తూ ఉన్నాయని ఫ్యాన్స్ కితాబునిస్తున్నారు. మార్క్ తాజా వీడియోను మీరు కూడా చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news