త్రివిక్రమ్ పై పవన్ ఒత్తిడి…!

-

తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఆయనతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన రాజకీయాలను పక్కన పెట్టి సినిమాలను చెయ్యాలని భావిస్తున్నారు. రాబోయే రెండు మూడేళ్ళలో ఆయన సినిమాలకే ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తుండగా ఆయన… వచ్చే ఏడాది క్రిష్ సినిమాను లైన్ లో పెట్టే అవకాశాలు ఉన్నాయి. కరోనా కట్టడి అయిన తర్వాత ఈ సినిమా మొదలుపెట్టే సూచనలు కనపడుతున్నాయి. ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసే సినిమా ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. అయితే ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తారట.

ఆ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఆయనపై ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రెండు మంచి హిట్ అయ్యాయి. జల్సా అత్తారింటికి దారేది సినిమాలు విజయం సాధించగా అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా తర్వాత పవన్ తో త్రివిక్రమ్ సినిమా చేయవద్దు అనుకున్నారు. అజ్ఞాతవాసి అప్పట్లో తీవ్ర విమర్శలు చేసారు పవన్ కళ్యాణ్ ఫాన్స్. అయితే పవన్ ఇందుకు సారీ చెప్పి సినిమా చెయ్యాలి అనుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news