సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా కార్తిక్ సుబ్బరాజు డైరక్షన్ లో వస్తున్న సినిమా పేట. ఈ సినిమా నుండి లేటెస్ట్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పోస్టర్ లో సీనియర్ హీరోయిన్ సిమ్రన్ కూడా ఉండటం విశేషం. పేట సినిమాలో రజిని సరసన సిమ్రన్ నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో త్రిష కూడా మరో హీరోయిన్ గా నటిస్తుందట.
ఈరోజు ఆ సినిమా నుండి రజిని, సిమ్రన్ ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ అయ్యింది. తన ట్విట్టర్ లో సిమ్రన్ స్వయంగా ఆ పోస్టర్ రిలీజ్ చేశారు. రజిని పక్క నేను.. అసలు ఇది నమ్మలేకున్నా అంటూ రజిని సరసన నటిస్తున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తపరచింది సిమ్రన్. నిన్నటితరం అందాల భామగా సౌత్ సిని ప్రియులను అలరించిన సిమ్రన్ కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి చేస్తున్న సినిమా పేట. మరి అమ్మడి సెకండ్ ఇన్నింగ్స్ కు రజిని సినిమా ఏమాత్రం సపోర్ట్ గా నిలుస్తుందో చూడాలి. ఈ సినిమాను సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే తెలుగులో సంక్రాంతి బరిలో రామ్ చరణ్ వినయ విధేయ రామ, ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ రిలీజ్ కు రెడీ అయ్యాయి. వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఎఫ్-2 కూడా సంక్రాంతి రిలీజ్ అంటున్నారు. మరి ఈ సినిమాల సందడిలో పేట ఎప్పుడు వస్తుందో చూడాలి.