దీప్ వీర్ బెంగళూరు రిసెప్షన్ ఫోటోలు అదుర్స్!

-

దీప్ వీర్.. అబ్బబ్బ… గత కొన్ని రోజుల నుంచి వీళ్లే కదా సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్. ఇటలీలోని లేక్ కోమోలో పెళ్లి జరుపుకున్న ఈ జంట.. నిన్న బెంగళూరులో అతిథులకు విందిచ్చారు. నగరంలోని లీలాప్యాలెస్ లో రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. దీపిక నేటివ్ ప్లేస్ బెంగళూరు తెలుసు కదా. అందుకే.. ఆమె సొంత ఊళ్లో దీప్ వీర్ రిసెప్షన్ ను గ్రాండ్ గా చేశారు. ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటాలియన్ వంటకాలు రిసెప్షన్ లో స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ అట. ఇక.. ముంబైలోనూ దీప్ వీర్ రిసెప్షన్ నవంబర్ 28న జరగనుంది. ఆ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నట్టు సమాచారం. బెంగళూరు రిసెప్షన్ లోని దీప్ వీర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version