హీరోయిన్ డింపుల్ హయాతిపై పోలీస్ కేసు

-

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదయింది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఆమె తన కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారం విషయంలో ఈ కేసు నమోదైంది. ఆమెతో పాటు డేవిడ్ అనే వ్యక్తి పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్​లో జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్​లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్ లో నటి డింపుల్ హయతి, డేవిడ్ అనే వ్యక్తి కూడా ఉంటున్నారు. రాహుల్ కారును అతడి డ్రైవర్ చేతన్ సెల్లార్​లో పార్క్ చేస్తూ ఉంటాడు. ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హాయతి డేవిడ్​లు కూడా తమ కారును పార్క్​ చేస్తుంటారు.

ఈ నెల 14న డింపుల్ హయాతి తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న కారు ముందు భాగం దెబ్బతింది. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు డింపుల్, డేవిడ్​లకు 41 నోటీసులు ఇచ్చి పంపించేశారు.

Read more RELATED
Recommended to you

Latest news