పూజా హెగ్దెని మోసం చేశారా..!

-

ముకుంద, ఒక లైలా కోసం సినిమాల తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ పక్కన మొహెంజోదారో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది పూజా హెగ్దె. ఇంకే ఆ సినిమా తర్వాత అమ్మడిని అందుకోవడం కష్టమే అనుకున్నారు కాని డిజేతో అమ్మడి అసలు లెక్క మారింది. బన్ని సినిమాలో బికిని పూజా ఫేట్ మార్చేసింది. పూజా అందాలకు ఫిదా అయిన ప్రేక్షకులు ఆమెకు స్టార్ పట్టం కట్టేశారు.

డిజే తర్వాత స్టార్ అవకాశాలు రాగా ఆమధ్యలోనే బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యంలో నటించింది ఈ చిన్నది. ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడమే కాకుండా సినిమా మరో బాహుబలి లాంటి సబ్జెక్ట్ అని కచ్చితంగా డబుల్ ఇమేజ్ సంపాదించడం గ్యారెంటీ అని ఊరించారట. ఆ కాన్సెప్ట్ తోనే పూజా శ్రీనివాస్ తో జోడి కట్టింది.

ఇప్పుడు సినిమా ఫలితం అమ్మడి కెరియర్ ను మళ్లీ సందిగ్ధంలో పడేసింది. ఇక సాక్ష్యం ఎలాగు పోయింది కాబట్టి ఎన్.టి.ఆర్ అరవింద సమేత మీద ఆశలు పెట్టుకుంది పూజా. దీనితో పాటుగా మహేష్ 25వ సినిమాలో కూడా పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news