ఆమ్మో..! పూజా ఏంటీ వ‌ర్క్ అవుట్లు..?(వీడియో)

-

పూజా హెగ్డే.. ఈ పొడుగు కాళ్ల సుందరి సొగసులు చూసి ఎవ‌రికైనా మ‌తిపోవాల్సిందే. వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది. అల్లు అర్జున్ సరసన ‘డీజే’ లోహాట్‌గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’లో క్యూట్‌గా మైమరిపించింది. మహేష్‌ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ భామ డీజే తర్వాత బన్నీతో మరోసారి అల వైకుంఠపురములోలలో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దీంతో ఊపుమీద వున్న పూజ, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇక ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామా జాన్‌లో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది పూజ. అయితే మ‌రోవైపు ఈ బ్యూటి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి జిమ్‌లో నానా ర‌కాలుగా ట్రై చేస్తుంది. మ‌రి ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news