ఒక్క రోజే 4 వేలు పెరిగిన కరోనా కేసులు…!

-

కరోనా వైరస్ ఇప్పుడు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. చైనా సహా పలు దేశాల్లో ఈ వైరస్ ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సరే పరిస్థితులో ఏ మార్పు రావడం లేదు. ఇప్పటికే పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అనేక చర్యలు పలు దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. జర్మని శ్రీలంక దేశాల్లో ఒక్కో కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి.

దీనితో శ్రీలంక ఇప్పుడు చైనా, తైవాన్ సహా పలు దేశాల నుంచి ప్రయాణికులను ఆపేసింది. ఇక ఇదిలా ఉంటే చైనాలో ఇప్పుడు ఈ వైరస్ తీవ్రత భారీగా పెరిగిందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఆ దేశంలో ఒక్క రోజే నాలుగు వేలకు పైగా పెరిగినట్టు తెలుస్తుంది. దాదాపు 7 వేల మందికి ఈ వ్యాధి సోకినట్టు సమాచారం. దీనితో చైనా ప్రభుత్వం పలు నగరాలకు రవాణా సౌకర్యాలను ఆపేసింది.

పలు నగరాలను విమాన సర్వీసులను కూడా ఆ దేశం ఆపెసినట్టు సమాచారం. ఇక భారత్ కూడా చైనా నుంచి విమానాలను ఆపేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. చైనాలో 132 మంది ఇప్పటి వరకు మరణించారని సమాచారం. మృతుల సంఖ్య బుధవారం మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే పలు నగరాల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆస్పత్రులను నిర్మించే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఊహాన్ నగరంలో ఈ కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news