షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ అక్షరాల అన్ని లక్షలు సంపాదిస్తున్న పూజా హెగ్డే..!!

-

టాలీవుడ్ హీరోయిన్ పూజ హెగ్డే గతేడాది వరకు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.. రాధే శ్యామ్ సినిమా తరువాత పూజ హెగ్డే తెలుగులో ఏ సినిమా కూడా చేయలేదు.. అయితే ఇటీవలే వచ్చిన గుంటూరు కారం సినిమాలోని ఆఫర్లు కూడా రిజెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా పలు రకాల అవకాశాలు రావడంతో ఎక్కువగా అక్కడే మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా వెళుతున్న ఈ ముద్దుగుమ్మ భారీగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

ఒకప్పుడు ఇండస్ట్రీలో పూజ హెగ్డేను అభిమానులు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పిలుచుకునేవారు.. ఇప్పుడు మాత్రం ఐరన్ లెగ్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు..పూజ హెగ్డే రెమ్యూనరేషన్ తగ్గిన కూడా రిస్క్ ఎందుకని కొత్త సినిమా ఆఫర్లు కూడా పలువురు దర్శక నిర్మాతలు ఇవ్వడానికి మక్కువ చూపు లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ గెస్ట్ గా వెళుతోందని సమాచారం.

తాజాగా కడపలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం పూజ హెగ్డే హాజరుకాగా అక్కడ రిబ్బన్ కటింగ్ పూజ హెగ్డే ఏకంగా 40 నిమిషాలకు రూ .40 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పలువురు అభిమానులు నెట్టిజనులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా ఆఫర్లు తగ్గిన పూజ హెగ్డే క్రేజ్ మాత్రం తగ్గలేదని పలువురు నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది పూజ హెగ్డే..

Read more RELATED
Recommended to you

Latest news