ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ మీకుందా..? అయితే మీరు కనుక మీ పీఎఫ్ అకౌంట్‌లో ఎంత ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇలా చేయండి. పీఎఫ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి అనేక దారులు ఉన్నాయి. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో, ఉమంగ్ యాప్ ద్వారా, SMS అలర్ట్ ద్వారా కానీ లేదంటే మిస్డ్ కాల్ సర్వీసుల ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉండాలి. ఇక బ్యాలెన్స్ ని తెలుసుకోవాలి అంటే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి ఉమంగ్ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.
ఈపీఎఫ్‌ఓ సర్వీసుల కోసం రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్ తో రిజిస్ట్రేషన్ చేస్తే చాలు.
రిజిస్టర్ అయ్యాక టాప్ లో సర్చ్ బార్ దగ్గర EPFO అని టైప్ చేయాలి.
ఈపీఎఫ్‌ఓ కు సంబంధించిన పలు సర్వీసులు ఉంటాయి.
సర్వీస్, డిపార్ట్‌మెంట్ అనే ఆప్షన్లు కనపడతాయి.
సర్వీసెస్ ట్యాబ్‌పై క్లిక్ చేస్తే వ్యూ పాస్‌బుక్ అనేది కనపడుతుంది. అక్కడ Employee Centric Service, General Service, Employer Centric Service ఇలా 3 కనిపిస్తాయి. ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీస్‌పై క్లిక్ చేయాలి.
మీకు లాగిన్ డీటెయిల్స్ కనపడతాయి.
UAN నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
ఆ తర్వాతి స్టెప్‌లో ఈపీఎఫ్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
దాన్ని మీరు ఎంటర్ చేస్తే మీ పీఎఫ్ పాస్‌బుక్ కనిపిస్తుంది. ఇలా మీరు బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.