‘గుంటూరు కారం’ పూజా హెగ్డే పిక్స్ వైరల్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుందా అని అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది.

గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మొన్నటి నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ‘గుంటూరు కారం’ అందుబాటులోకి వచ్చింది. అయితే.. తాజాగా గుంటూరు కారం సినిమాలో హీరోయిన్‌ గా మొదట అనుకున్న పూజా హెగ్డే ఫోటోలు వైరల్‌ గా మారాయి. ఈ సినిమాలో మొదట నటించిన పూజా సెట్స్‌ ఫోటోలు రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news