నయా లుక్ తో అదరగొడుతున్న పూజా హెగ్డే..!!

-

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన పూజా హెగ్డే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గడిచిన కొద్దిరోజుల క్రితం ఈమె కాలికి గాయం అవ్వడంతో కొద్దిరోజులు రెస్టు తీసుకుంది. ఇప్పుడు తాజాగా నయా లుక్ లో మతులు పోగొట్టేలా కనిపిస్తోంది పూజా హెగ్డే. ఒకవైపు పలు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఇలా ఫ్యాషన్ లో కూడా తన సత్తా చాటుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

Photos: पूजा हेगड़े कैजुअल लुक में बरपा रहीं हैं कहर, किलर अवतार में एक्ट्रेस दिखीं बेहद Hotఇక ఇటీవల తన బాలీవుడ్ లో నటించిన సర్కస్ సినిమా టీజర్ లాంచ్ వేడుకలలో ప్రత్యక్షమైంది. అక్కడ చాలా స్టైలిష్ బ్రౌన్ కలర్ కాటన్ జీన్స్ లో అందుకు కాంబినేషన్ గా బ్లాక్ టాప్ లో అదరగొట్టేస్తోంది పూజ హెగ్డే.

రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సర్కస్ సినిమా 1960 కథ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్.. పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరి పాత్ర కూడా డైరెక్టర్ రోహిత్ శెట్టి ఎంతో అద్భుతంగా మలిచారని ఇటీవల టీజర్ ను చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ రోజున ట్రైలర్ విడుదల కాబోతూ ఉండడంతో మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

గతంలో మన తాతయ్యలు, నానమ్మలు ఉండేటువంటి రోజులలో కథ అన్నట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కూడా చాలా సంథింగ్ స్పెషల్ గా కనిపించబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా సర్కస్ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో నటిస్తూ ఉన్నది. పూజా హెగ్డే కి సంబంధించి ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news