సినీ రీఎంట్రీ విషయమై యూటర్న్ తీసుకున్న పవన్….??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఘోర పరాజయం అనంతరం, ప్రజల్లోకి పార్టీని మరింతగా చేరువ చేసే విషయమై పలు విధాలుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో తన సినీ లైఫ్ కి గుడ్ బై చెప్పడం జరిగింది. అయితే ఆ సినిమా రిలీజ్ తరువాత దారుణమైన పరాజయాన్ని అందుకోవడంతో తమ కోసం ఒక మంచి సినిమా చేయాలని పవన్ ఫ్యాన్స్ ఆయనను ఎప్పటినుండో కోరుతున్నారు. కాగా ఎప్పటినుండో వారి విన్నపాలు వింటున్న పవన్, ఎట్టకేలకు ఒక సినిమాలో నటించటానికి ముందుకు రావడం, ఆ సినిమాకు సంబంధించి ఇటీవల ప్రకటన రావడం జరిగింది.

దిల్ రాజు, బోని కపూర్ నిర్మాతలుగా యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమాలో నటించబోతున్నట్లు ఆ వార్త యొక్క సారాంశం. ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్న క్రైమ్, డ్రామా మూవీ ‘పింక్’ రీమేక్ లో నటించడానికి పవన్ కళ్యాణ్ సిద్దమైనట్లు తెలిసింది. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, పవన్ చేయబోయే సినిమా ఇది కాదని అంటున్నారు. తన రీఎంట్రీ పింక్ రీమేక్ తో ఇస్తున్నట్లు ముందుగా మీడియాకు వార్త లీక్ చేసిన దిల్ రాజు, బోనిల పై పవన్ కొంత అసహనం వ్యక్తం చేసారని,

 

అలానే తనకు రీమేక్ ద్వారా కంటే ఏదైనా డైరెక్ట్ కథతో రీఎంట్రీ ఇవ్వాలని మనసులో ఉన్నట్లు చెప్పారట పవన్. కాగా ఇప్పటికే ఈ సినిమా విషయమై సెట్టింగ్స్ వేయడం అలానే మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా పూర్తి కావచ్చిందని, ఇటువంటి పరిస్థితుల్లో పవన్ షాకింగ్ నిర్ణయంతో వారిద్దరూ కొంత షాక్ తిన్నారట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక సమాచారం మాత్రం వెలువడాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఈ వార్త పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….!!