హత్యాచార బాధితురాలి పేరు మార్పు

-

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, హత్యాచార బాధితురాలి అసలు పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఇంకా ఆమె గుర్తింపును తెలిపేలా ఏ ఇతర మార్గాలను అనుసరించరాదని కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు.

శంషాబాద్‌లో ఇటీవల జరిగిన దారుణ మారణహోమం తాలూకు బాధితురాలికి ‘దిశ’గా పేరు మార్చారు. ఇకనుంచి ఆమెను ‘దిశ’గానే వ్యవహరించాలని సైబరాబాద్‌ కమిషనర్‌ విసి. సజ్జనార్‌, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ మీడియాకు విజ్ఞప్తి చేసారు.

పేరు మార్పును బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపి, ఈ మేరకు వారిని కూడా ఒప్పించారు. చనిపోయినవారి పరువుప్రతిష్టలు కూడా కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని గుర్తుచేసిన సజ్జనార్‌, ‘నిర్భయ’ ఉదంతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉటంకించారు. సోషల్‌ మీడియాలో కూడా ‘#JusticeForDisha’ అనే ట్యాగ్‌తోనే నివాళులు అర్పించాలని ఆయన కోరారు. ఎక్కడా ఆ అమ్మాయి ఫోటోలు కూడా వాడరాదని ఈ సందర్భంగా అన్ని మీడియా సంస్థలు, స్వచ్చంద సంస్థలకు విజ్ఞప్తి చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news