కామిక్ కాన్​ ఈవెంట్​కు అల్ట్రా స్టైలిష్ లుక్​లో ప్రభాస్ .. ఫొటోలు వైరల్

-

సోషల్ ​మీడియా ఇప్పుడు సందడంతా ప్రాజెక్ట్-కె సినిమాదే. నిన్న ఈ మూవీ టీమ్ ప్రభాస్​ పోస్టర్​ను రిలీజ్ చేయడంతో మీమ్స్, రీల్స్, రియాక్షన్లతో నెట్టింట హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. మరోవైపు ఈ టైటిల్ గ్లింప్స్​ లాంఛ్​ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ .. అమెరికాలోని శాన్​ డీగో ప్రఖ్యాత కామిక్ కాన్ ఈవెంట్​కు వెళ్లిన సంగతి తెలిసిందే.

కామిక్​ కాన్​ ఈవెంట్​లో ప్రాజెక్ట్ కె సినిమా ప్రమోషన్స్ హడావుడి షురూ అయింది. ఈ ఈవెంట్​లో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్​లో సందడి చేశాడు. బ్లూ కలర్ సూట్​లో సూపర్​గా కనిపించాడు. ప్రస్తుతం ప్రభాస్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు ఈ మూవీలో రైడర్సే ప్రతినాయకులు అని గతంలో బాగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కామిక్ కాన్ ఈవెంట్​కు భారీ ఎత్తున రైడర్స్ వచ్చారు. బ్లాక్ సూట్స్​తో శరీరమంతా కవర్ చేసి.. ఈవెంట్​కు హాజరయ్యారు. Now Begins The End అంటూ బ్యానర్స్ పట్టుకొని ఈవెంట్ దగ్గర హడావిడి చేస్తున్నారు. ఆ ఈవెంట్​కు వచ్చే ఆడియెన్స్​తో సరదాగా ఫొటోలు దిగుతున్నారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news