సీఎం జగన్ కు బిగ్ షాక్: వైసీపీకి కీలక నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ గుడ్ బై ?

-

ఏపీలో రామచంద్రపురం నియోజకవర్గంలో వర్గపోరు పంచాయితీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మరియు రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు మధ్యన ఇంకా ఒక ముగింపుకు రాలేదు. సీఎం జగన్ సుభాష్ చంద్రబోస్ ను పిలిపించి మాట్లాడినా కుదరలేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం రామచంద్రాపురానికి ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల్ వచ్చే ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే సీటును కోరుకుంటున్నాడు. ఇక జగన్ కూడా ఎమ్మెల్యే సీటును వేణుగోపాల్ కే ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాడట. కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎలాగైనా ఆ టికెట్ ను కొడుకు సూర్యప్రకాష్ కు ఇవ్వాలని అడుగుతున్నాడట. కానీ జగన్ ఎందుకో ఈ విషయంలో లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.

రాజశేఖర్ రెడ్డి నుండి ఈయన ఇప్పుడు కేవలం కొడుకు సీటు కోసం పార్టీ మారుతాడా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news