ఫిట్ నెస్ ట్రైనర్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్..

-

బాడీని ఫిట్ గా ఉంచుకోవడం సినిమా సెలెబ్రిటీలకి తప్పనిసరి. తమ అభిమానులు సెలెబ్రిటీలపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. రక రకాల పాత్రల్లో తమ హీరోని ఊహించుకుంటూ ఉంటారు. వారి అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా ఉండాలంటే రెగ్యులర్ గా బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి. అందుకే ఏళ్లకి ఏళ్ళు సినిమాలు తీసినా ఒకేలా కనబడుతుంతారు. ఈ విషయంలో సెలెబ్రిటీలు చాలా జాగ్రత్త పడుతుంటారు.

 

అందుకే ఫిట్ నెస్ ట్రైనర్ ని ఎంపిక చేయడంలో శ్రద్ధగా ఉంటారు. ఐతే తాజాగా ప్రభాస్ తన ఫిట్ నెస్ ట్రైనర్ కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిట్ నెస్ ట్రైనర్ లక్ష్మణ్ కి రేంజ్ రోవర్ కారు బహుమతిగా ఇచ్చాడట. రేంజ్ రోవర్ కారు ఎంత ఖరీదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో అందంగా కనబడాలంటే ట్రైనర్ ఇచ్చే శిక్షణ ఎంతో ముఖ్యం. మరి అలాంటి శిక్షణ అందిస్తున్న ట్రైనర్ కి ప్రభాస్ ఇచ్చిన బహుమతి సరైనదే..

Read more RELATED
Recommended to you

Latest news