మదన్ రెడ్డి అనే కుర్రాడికి ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అంటే చాలా ఇష్టం. అందులో ప్రభాస్ అంటే ఇంకా ఇష్టం. ఎన్నో సార్లు బాహుబలి సినిమాను చూసి బాహుబలి ప్రభాస్ మీద అభిమానం పెంచుకున్నాడు. కొన్ని రోజుల తరువాత తన అభిమాన నటుడు ప్రభాస్‌ని కలవాలని కోరుకున్నాడు.
మదన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆ కుర్రాడి కోరికను తీర్చడానికి అతడి తండ్రి ప్రభాస్ అభిమానుల సహాయంతో సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఈ వార్త ప్రభాస్‌కు చేరేలా చేసాడు. ఇప్పుడు మొత్తానికి మదన్ రెడ్డి తన అభిమాన హీరో ప్రభాస్‌ని కలిసాడు. ప్రభాస్ మంచితనం గురించి సింప్లిసిటీ గురించి మనం ఎన్నో కథనాలు విన్నాం. ఇప్పుడు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు బాహుబలి ప్రభాస్.