టిప్ టిప్ బర్సా పానీ.. అంటూ ప్రభాస్ తో స్టెప్పులు వేసిన రవీనా టాండన్.. వైరల్ వీడియో

ప్రభాస్.. ఈయన ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు. వుడ్ లతో సంబంధం లేకుండా నేషనల్ స్టార్ డమ్ ను తెచ్చుకున్న హీరో. బాహుబలితో ఒక్కసారిగా ప్రభాస్ రేంజే పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ కు టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అని తెలుస్తుంది ఈ షో చూస్తే. అవును… ప్రభాస్ స్టార్ ప్లస్ చానెల్ లో వచ్చే నాచ్ బలియే 9 డ్యాన్స్ షోకు వెళ్లారు.


సాహో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 30 న రిలీజ్ అవుతోంది కదా. సినిమా తెలుగు, తమిళం, హిందీలో రిలీజ్ అవుతోంది. సో.. బాలీవుడ్ లో కూడా తమ సినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించారు. శ్రద్ధాతో పాటు ప్రభాస్ కూడా గెస్ట్ గా వెళ్లారు. షోలో జడ్జ్ రవీనా టాండన్ తో కలిసి ప్రభాస్ స్టెప్పులేశారు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ టిప్ టిప్ బర్సా పానీ అనే సాంగ్ ప్లే అవుతుండగా… రవీనాతో కలిసి ప్రభాస్ స్టెప్పులేశారు. దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ ప్లస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈషోలో పాల్గొన్న సాహో స్టార్లు కాసేపు సాహో ముచ్చట్లు చెప్పారు. సాహో సినిమా ప్రత్యేకతలను ప్రేక్షకులతో పంచుకున్నారు. రవీనా, ప్రభాస్ డ్యాన్స్ చేస్తుండగా… ప్రేక్షకులంతా ఒక్కసారిగా చప్పట్లతో షోను ఎక్కడికో తీసుకుపోయారు. ఈసందర్భంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న ప్రభాస్.. తాను రవీనా టాండన్ ఫ్యాన్ అంటూ చెప్పారు. అందుకే.. తనతో కలిసి డ్యాన్స్ వేశారు. ప్రభాస్ తన అభిమాని అని తెలుసుకున్న రవీనా ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం.. ప్రభాస్, రవీనా డ్యాన్స్ వీడియోను చూసేయండి.