Prabhas Saaho Trailer : సాహో ట్రైల‌ర్‌లో ట్విస్ట్ గ‌మ‌నించారా…

-

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సాహో ట్రైల‌ర్ వ‌చ్చేసింది. శ‌నివారం సాయంత్రం రిలీజ్ అయిన ఈ ట్రైల‌ర్‌లో అదిరిపోయే విజువ‌ల్ ఫీస్ట్‌గా ఉంది. మొత్తం 2.46 నిమిషాల పాటు ఉన్న ట్రైల‌ర్ మొత్తం యాక్ష‌న్ క‌ట్స్‌తో నింపేశారు. రూ.2 వేల కోట్ల బ్యాంక్ రాబ‌రీకి చెందిన అంశంతో ట్రైల‌ర్ స్టార్ట్ అయ్యింది. సినిమా క‌థ కూడా ఈ నిధికి సంబంధిం అటు మాఫియా గ్యాంగ్‌కు ప్ర‌భాస్‌కు సాగే ఎత్తులు, పై ఎత్తులు యాక్ష‌న్‌తో న‌డుస్తుంద‌ని తెలుస్తోంది.

Prabhas Saaho Movie Trailer Review

సినిమాలో డేంజ‌ర‌స్ మాఫియా లీడ‌ర్స్‌గా చుంకి పాండే – జాకీ ష్రాఫ్ – లాల్ క‌నిపిస్తున్నారు. వీరికి ప్ర‌భాస్‌కు మ‌ధ్య జ‌రిగే వార్ అదిరిపోతుంద‌ని ట్రైల‌ర్ చెప్ప‌క‌నే చెప్పేసింది. ఇక హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ క్యారెక్ట‌ర్‌కు కూడా కావాల్సినంత స్కోప్ ఉంద‌ని తెలుస్తోంది. పోలీస్ అయిన శ్రద్దాను తన ప్రయోజనం కోసం ప్ర‌భాస్ మోసం చేస్తాడ‌ని ట్రైల‌ర్ చివ‌ర్లో వ‌చ్చే షాట్ ద్వారా అర్థ‌మ‌వుతోంది.

పోలీస్‌గా ఉన్న శ్ర‌ద్ధాను ప్రేమ పేరుతో వాడుకుని త‌న అవ‌స‌రాలు తీర్చుకుంటాడ‌ని తెలుస్తోంది. అందుకే ఆమె గ‌న్ ప్ర‌భాస్‌కు గురిపెట్టి గుండెల్లో ఏమిలేదు, అంతా మైండ్ లోనే ఉంది అని చెప్పే డైలాగ్‌తో ప్ర‌భాస్‌కు ప్రేమ‌లు, గీమ‌లు ఉండ‌వ‌ని, కేవ‌లం అత‌డి వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు, స్వార్థ‌మే ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలోనే ఆమె నువ్వు ఒక దొంగ,నేను ఒక పోలీస్ కలవడం కుదరదు అని చెపుతుంది. అయితే ఇక్క‌డే ద‌ర్శ‌కుడు సుజీత్ ఓ ట్విస్ట్ ఇచ్చాడ‌న్న డౌట్ కూడా వ‌స్తోంది. ప్ర‌భాస్ దొంగ కాద‌ని… అత‌డు మాఫియా అంతు చూడ‌డానికి మాఫియాతో లింకులు ఏర్ప‌రుచుకున్న అండర్ కవర్ పోలీస్ ఆఫీస‌ర్ అన్న‌దే ట్విస్ట్‌గా తెలుస్తోంది. ఈ విష‌యం చివ‌ర్లో రివీల్ అవుతుంద‌ని కూడా స‌మాచారం. ఏదేమైనా ట్రైల‌ర్‌లో అంద‌రి మైండ్లు బ్లాక్ చేసిన ప్ర‌భాస్ సినిమాతో ఇంకెలా చేస్తాడో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news