లిక్కర్ స్కామ్ పై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు లిక్కర్ స్కామ్ జరిగిందన్న ఆయన.. ఇది జగమెరిగిన సత్యం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ ముందు పీనట్స్ అంత ఉందని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ అతిపెద్ద స్కామ్ అని.. మొదటి నుంచి మేము చెబుతున్నాం. వైసీపీ నుంచి బయటికీ వచ్చి మా పార్టీ నుంచి గెలిచిన ఎంపీ లావు పార్లమెంట్ లో చెప్పారు. ఇదే విషయం పై కేంద్ర హోంమంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చారని తెలిపారు. విజయసాయి రెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో వైఎస్ జగన్ ఏజెంట్ గా ఉన్నాడని చెప్పారన్న ఆయన.. వాల్ల నాయకులే ఇదంతా చెబుతున్నారు.
లిక్కర్ లో ప్రతీ దశలో స్కామ్ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రం ఈ స్కామ్ వల్ల వేల కోట్ల ఆదాయం కోల్పోయిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీంతో పక్క రాష్ట్రాలు బాగుపడ్డాయన్న ఆయన.. 99వేల కోట్లు నగదు లావాదేవీలు జరిగాయి. లిక్కర్ స్కామ్ పై సీఐడీ, సిట్ విచారణ జరుగుతోందన్నారు. మరోవైపు బియ్యం కేసు ఇంకా విచారణ దశలో ఉందని పేర్ని నాని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.