Pragya Jaiswal : అందాల కంచె దాటుతోన్న ప్రగ్యా జైస్వాల్

-

ప్రగ్యా జైస్వాల్.. మధ్యప్రదేశ్ లో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ బ్యూటీ కి ఆరంభం నుంచి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.

వరుణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రగ్యా జైస్వాల్.. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసింది.

అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఇక ఈ భామ గతేడాది హీరోయిన్‌గా నటించిన అఖండలో బాలకృష్ణకు జోడి కట్టింది.

మాస్ డైరెక్టర్ బోయ పాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ. ఈ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రంపై భారీ అంచనాలతో విడుదలై మంచి విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news