గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ప్రెగ్నెంట్ అంటూ ట్వీట్

-

అత్తారింటికి దారేది, రభస వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల నటి ప్రణీత సుభాష్ 2021లో ఓ ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు ను వివాహం చేసుకుంది.కాగా ఈ ఈరోజు ప్రణీత భర్త నితిన్ రాజు ది పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా ద్వారా తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నా జీవితంలో ఒక ప్రత్యేక రోజు అంటూ చెప్పుకొచ్చింది.

 

నితిన్ రాజు 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈరోజు తాను గర్భవతిని అని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది ప్రణీత సుభాష్.దీంతో ప్రణీత సుభాష్ అభిమానులు ట్విట్టర్ వేదిక ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం ప్రణీత సుభాష్ ఓ కన్నడ చిత్రంలో నటిస్తున్నారు.” వికాస్ పంపాపతి, వినయ్ పంపాపతి దర్శకత్వంలో “రమణ అవతార” అనే చిత్రంలో నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news