ప్రాంక్ లీ స్పీకింగ్ .. : తెలంగాణ‌లో మ‌రో వివాదం.. రాత్రి వేళ ర‌భస ?

తెలంగాణ వాకిట మ‌రో వివాదం రేగింది. మొన్నా మ‌ధ్య విష్వ‌క్సేన్ వివాదం ఎంత‌టి ర‌గ‌డ చేసిందో తెలిసిందే ! అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం సినిమా పై ఆ ప్రాంక్ వీడియో ప్ర‌భావం ఏ మేర‌కు ఉందో తెలియ‌దు కానీ మొత్తానికీ ఆ వీడియో మాత్రం తెగ వైర‌ల్ అయింది. ఆ త‌రువాత ఓ ప్ర‌ముఖ ఛానెల్ లో కూడా ర‌చ్చ ర‌చ్చ అయింది. ఇదే త‌గువులో ఓ యాంక‌ర్-కు, విష్వ‌క్-కు మధ్య తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. బూతులు కూడా ఒక‌రినొక‌రు తిట్టుకున్నారు. ఆ గొడ‌వ ముగిసింది అని అనుకునేలోపే మ‌రో ర‌గ‌డ మొద‌ల‌యింది.

క‌రాటే క‌ల్యాణీ కీ, యూట్యూబ‌ర్ శ్రీ‌కాంత్ రెడ్డికి మ‌ధ్య నిన్న రాత్రి యూస‌ఫ్ గూడ బ‌స్తీలో పెద్ద వివాదమే జ‌రిగింది. వాగ్వాదం ఎలా ఉన్నా శ్రీ‌కాంత్ రెడ్డి ఉన్న చోటుకు వెళ్లి చిత‌క బాది వ‌చ్చింది. ఆయ‌న వీడియోల్లో అన్నీ వ‌ల్గ‌ర్ వ‌ర్డ్స్, వల్గ‌ర్ కామెంట్స్, సెక్స్ చాట్ ఉండ‌డంతో మ‌హిళ‌ల‌ను పూర్తి స్థాయిలో కించ‌ప‌రిచే ప‌ద్ధ‌తులు మానుకోవాల‌ని చెబుతూ చెంప ఛెళ్లుమ‌నిపించింది క‌రాటే క‌ల్యాణి. దీంతో ఆయ‌న కూడా ఎదురు దాడి చేశాడు. ఈ గొడ‌వ‌లో చంటి పిల్ల‌తో అక్క‌డికి వెళ్లిన ఆమె కింద ప‌డిపోయింది. త‌రువాత శ్రీ‌కాంత్ రెడ్డిని ఉరికించి, ఉరికించి కొట్టింది. ఇప్పుడిదే తెగ వైర‌ల్ అవుతోంది.

ప్రాంక్ వీడియోలతో ద‌క్కించుకున్న పాపులారిటీ వ‌ల్ల ఏమ‌యినా అవ‌కాశాలు వ‌స్తున్నాయా అంటే అదీ లేదు.ఏవో ఒక‌టో అర త‌ప్ప పెద్ద‌గా ఈ వీడియోల వ‌ల్ల జ‌నాల‌కు వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏమీ లేదు. ఆ కంటెంట్ అంతా అశ్లీలంతో నిండే ఉంటుంది. ఏమంటే సినిమాల్లో లేని అభ్యంత‌రం మాకెందుకు అని దిగ‌జారుడు స‌మాధానాలు మాత్రం బోల్డ్నెస్ పేరుతో ఇస్తూ త‌ల‌పొగరు చూపిస్తున్నారు కొంద‌రు యూ ట్యూబ‌ర్లు. ఇదెంత మాత్రం త‌గ‌ద‌ని ప‌లువురు హిత‌వు చెబుతున్నారు.