ఎప్పటికైనా ఆ కోరిక తీరాలనుకున్న ప్రియమణి.. తీరిందా..?

-

ప్రముఖ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మొదట్లో సెకండ్ హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ హీరోయిన్గా ఎరిగింది. స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందే క్రమంలోనే ముస్తఫా రాజ్ ను వివాహం చేసుకొని.. సినీ ఇండస్ట్రీకి దూరమైంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరమైనా..ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఢీ వంటి డాన్స్ షో కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ప్రియమణి అదే సమయంలోనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.

- Advertisement -

అయితే ఒకానొక సమయంలో ఆ కోరిక తీర్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేసిందట ప్రియమణి. మరి ఆ కోరిక ఏంటి..? తీరిందో లేదో ఇప్పుడు చూద్దాం.. అసలు విషయంలోకెళితే ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు నిర్మించిన రామానాయుడు స్టూడియోలో వారి సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో నటించే ప్రతి హీరోయిన్ ఫోటోలు స్టూడియోలో పెట్టడం ఆనవాయితి.. ఈ క్రమంలోనే ఒకసారి రామానాయుడు స్టూడియోకి వేరే సినిమా షూటింగ్లో భాగంగా వెళ్లినప్పుడు అక్కడ చాలామంది హీరోయిన్ల ఫోటోలు చూసి ఆశ్చర్యపోయిందట ప్రియమణి.. అయితే ఎందుకు ఈ హీరోయిన్ల ఫోటోలను ఇక్కడ పెట్టారు అని అడగ్గా సురేష్ ప్రొడక్షన్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించే సినిమాలలో నటించే హీరోయిన్ల ఫోటోలను ఇక్కడ పెట్టడం ఆనవాయితీ అంటూ అక్కడి బృందం వెల్లడించిందట.

ఎప్పటికైనా సరే రామానాయుడు స్టూడియో నిర్మాణ సారథ్యంలో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక్కసారైనా నటించాలని.. ఎలాగైనా సరే అక్కడ కూడా తన ఫోటో చూసుకోవాలని చిరకాల కోరికగా అనుకుందట ప్రియమణి. అందులో భాగంగానే ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమాలో డి గ్లామరస్ పాత్రలో కూడా నటించడానికి ఒప్పుకుంది. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మొదట్లో రామానాయుడు స్టూడియోలో నా ఫోటో ఉండాలని కోరుకున్న మాట వాస్తవమే.. కానీ ఇప్పుడు అక్కడ నా ఫోటో ఉందో లేదో తెలియదు కానీ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించడం సంతృప్తికరంగా ఉంది ఇదే చాలు.. అంటూ వెల్లడించింది ప్రియమణి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...