భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా తక్షణ బ్రేక్ పడింది. శనివారం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై కీలక ప్రకటన చేస్తూ, ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించారు. ఈ ప్రకటన అనంతరం పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ స్పందిస్తూ ఈ విషయాన్ని ధృవీకరించారు. “పాకిస్థాన్ – భారత్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ, పాకిస్థాన్ తన సార్వభౌమాధికారాన్ని గానీ, ప్రాదేశిక సమగ్రతను గానీ రాజీపడలేదు. దేశంలో శాంతి మరియు భద్రత కోసం మేము ఎప్పుడూ కృషి చేస్తాం,” అని ఇషాక్ దార్ ట్వీట్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్ తన ఎక్స్ (X) ఖాతాలో పోస్టు చేస్తూ, భారత్ – పాకిస్థాన్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇరు దేశాలు వివేకంతో వ్యవహరించాయని, శాంతిని కాపాడేందుకు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుతాయని, శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశముందని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది.