యూత్ కి పిచ్చెక్కిస్తున్న పూజిత..!

-

కన్నడ భామ పూజిత పొన్నాడ తెలుగు ఆడియెన్స్ కు కొత్తేమి కాదు. రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టిని ప్రేమించిన అమ్మాయిగా నటించింది పూజితనే. అయితే ఆ సినిమాలో ఆమెకు అంత ప్రాధాన్యత లభించలేదు. అయితే కన్నడలో మాత్రం లీడింగ్ యాక్ట్రెస్ గా ఉన్న పూజిత తెలుగులో రాయ్ లక్ష్మి లీడ్ రోల్ లో చేస్తున్న వేర్ ఈజ్ వెంకటలక్ష్మిలో కూడా నటించింది.

ఈ సినిమాలో పూజిత అందాలకు గట్టి పని చెప్పినట్టు తెలుస్తుంది. లీడ్ యాక్టర్ తో పూజిత లిప్ లాక్, హాట్ సీన్స్ అదరగొడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలోని పూజిత సాంగ్ యూత్ ఆడియెన్స్ కు పిచ్చెక్కేలా చేస్తుందని చెప్పొచ్చు. అందాల నిధిగా కనిపిస్తున్న పూజిత ఈ ఒక్క సాంగ్ తో అదరగొట్టేస్తుంది.

రాయ్ లక్ష్మితో పాటుగా సినిమాలో ఈ అమ్మడు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం పూజిత అదరగొట్టిన ఆ రొమాంటిక్ వీడియో సాంగ్ మీరు చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news