Kriti Kharbanda : సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

-

అందాల భామ కృతికర్బంద గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పన్లేదు. బోణీ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ కృతికర్బంద. ఈ అమ్మడు మూడో సినిమాలోనే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జతకట్టింది. తీన్మార్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆడపాదడపా అవకాశాలు దక్కించుకుంది. మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త లాంటి సినిమాలలో కృతికర్బంద ఆడిపాడింది.

Pulkit Samrat, Kriti Kharbanda engaged, picture from roka ceremony go viral

ఇకపోతే….హీరోయిన్ కృతికర్బంద రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. గత నాలుగేళ్లుగా నటుడు పులకిత్ సామ్రాట్ తో డేటింగ్ లో ఉన్న ఈ బామ రీసెంట్ గా నిశ్చితార్థం చేసుకుంది. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ప్రకటన కృతి అధికారికంగా ప్రకటన చేయకపోయినప్పటికీ…. పులకిత్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అలాగే ఈ ఫొటోస్ ను జత చేస్తూ గ్లింప్స్ వీడియో షేర్ చేశారు. దీంతో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు వీరి పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు వాటిని నిజం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news