ఒక్క ఫొటోతో విడాకుల రూమర్స్ కు చెక్ పెట్టిన సూర్య- జ్యోతిక

-

కొంతకాలంగా కోలీవుడ్ పవర్ కపుల్ సూర్య, జ్యోతిక విడిపోతున్నారన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలో ఒక్క ఫొటోతో ఈ జంట ఈ పుకార్లకు చెక్ పెట్టింది. నిత్యం షూటింగ్స్తో బిజీగా ఉండే ఈ జంట తాజాగా విహార యాత్రకు వెళ్లారు. ఫిన్లాండ్లో జాలీగా గడిపి ఆ ఆనంద క్షణాలను కెమెరాలో బంధించారు. ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ ఫొటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ‘క్యూట్‌ కపుల్స్‌’, ‘వావ్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలతో సూర్య- జ్యోతిక విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలకు సదరు పోస్ట్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లైంది. కొన్ని నెలలుగా జ్యోతిక ఎక్కువగా ముంబయిలో ఉండడంతో వీరిద్దరు విడిపోతున్నారంటూ కోలీవుడ్‌లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక వాటిపై స్పందిస్తూ.. ‘‘మా అమ్మా నాన్న ముంబయిలో ఉంటారు. వారి ఆరోగ్యం, పిల్లల చదువుతోపాటు నేను బాలీవుడ్‌లో సినిమాలు చేస్తుండడంతో ముంబయికి షిఫ్ట్‌ అయ్యా. అంతేగానీ సూర్యకు, నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఆయన మంచి మనిషి. ఎప్పుడూ సపోర్ట్‌ చేస్తారు’’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news