Telangana: రాయితీ పెండింగ్‌ చలాన్లు.. నేడే ఆఖరు

-

Telangana: తెలంగాణ వాహనదారులకు బిగ్ అలెర్ట్. రాయితీ పెండింగ్‌ చలాన్లు కట్టుకునేందుకు.. నేడే ఆఖరు రోజు.ఈ మేరకు పోలీసులు కీలక ప్రకటన చేశారు. పెండింగ్ లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వాహనదారులకు చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే . అయితే పెండింగ్ చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది.

Today is the deadline for payment of traffic challans

వాహనాలపై ఉన్న ఫైన్లు చెల్లించే వారు ఈ కన్సెషన్ ఆఫర్ వినియోగించుకోవాలనుకుంటే వెంటనే చలాన్లు చెల్లించాలని ట్రాఫిక్ విభాగం కోరింది. 2023డిసెంబర్ 25కి ముందు ఉల్లంఘనలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. గడువు ముగిసిన తర్వాత మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు ,తోపుడుబండ్లపై 90% రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50% రాయితీని కల్పించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news