పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం

-

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించడాన్ని అతని ఫ్యాన్స్, కన్నడ ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. హఠాత్తుగా తమ హీరో మరణించడాన్ని తట్టుకోలేకపోతున్నారు. చిన్న వయసులోనే గుండె పోటు రావడంతో పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను, ప్రజలను కంట నీరు పెట్టించింది. ఆయన రూపాాన్ని.. ఆయన సినిమాల్లో చూసుకుంటున్నారు అభిమానులు. 

ఇదిలా ఉంటే పునీత్ రాజ్ కుమార్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన మామ, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వని నాన్నగారు మరణించారు. పునీత్ రాజ్ కుమార్ మరణాంతరం నుంచి రేవనాథ్( 78) తీవ్ర ఒత్తడికి లోనై అనారోగ్యం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే గుండె పోటుకు గురికాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పునీత్ రాజ్ కుమార్ కూడా గుండె పోటుతోనే మరణించిన సంగతి తెలిసిందే. భర్త, తండ్రిని కోల్పోయిన అశ్విని తీవ్ర దు:ఖంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news