Pushpa 2 : వైజాగ్‌లో పుష్ప-2 మూవీ షూటింగ్‌..బన్నీ వీడియో వైరల్

-

2021 లో సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా.. సమంత స్పెషల్ సాంగ్ లో అలరించిన చిత్రం పుష్ప.. ఇందులో సునీల్, అజయ్, అనసూయ తదితరులు నెగిటివ్ రోల్ పోషించి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. మొదటి సినిమా భారీ సక్సెస్ పొందడంతో ఇప్పుడు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోని పుష్ప 2 ఒక షెడ్యూల్ పూర్తికాగా మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. రేపటి నుంచి 10 రోజుల పాటు వైజాగ్‌లో పుష్ప-2 మూవీ షూటింగ్‌ జరుగనుంది. ఈ మేరకు అల్లు అర్జున్‌ వైజాగ్‌ చేరుకున్నారు. ఇండిగో ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి విశాఖ కు చేరుకున్నారు బన్నీ. ఇక వైజాగ్‌ ఎయిర్ పోర్టు నుండి నోవాటెల్ కు వెళ్లారు. షూటింగ్ అయ్యే వరకు అక్కడే బన్నీ ఉండే ఛాన్స్‌ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news