పుష్ప 2 సెట్ లో జానీ మాస్టర్ గొడవ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు… జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ ఉన్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఈ వార్తలను ఖండించిన పుష్ప 2 నిర్మాత మైత్రి రవి..కీలక ప్రకటన చేశారు. జానీ మాస్టర్ లేడీ డాన్సర్ వివాదం పూర్తిగా వాళ్ళిద్దరి మద్య జరిగిన పర్సనల్ ఇష్యూ అన్నారు. పుష్ప 2 సినిమా స్టార్టింగ్ నుంచి అన్ని పాటలకు అడిషనల్ కొరియోగ్రఫర్ గా ఆ లేడీ డాన్సర్ ను పెట్టుకున్నామని చెప్పారు.
ఆరు నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో కూడా ఆ డాన్సర్ పేరు ఉందని వివరించారు. జానీ మాస్టర్ తో రెండురోజుల్లో ఒక స్పెషల్ సాంగ్ చేద్దామనుకునే లోపు ఈ ఇస్యూ తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. సెట్ బిహైండ్ థాట్ ఏమీ జరుగుతుంది అనేది అల్లు అర్జున్ గారికి తెలీదని వెల్లడించారు. గొప్ప స్టేచర్ ఉన్న అల్లు అర్జున్ పై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళ ఉనికి కోసం ఇలా అలజడి సృష్టిస్తున్నాయని చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ ఆ లేడీ డాన్సర్ మధ్య వివాదం పూర్తిగా వాళ్ళ పర్సనల్ అన్నారు.