ఉ అంటావా మావా ప్రాక్టిస్‌లో కుమ్మేసిన స‌మంత.. వీడియో వైర‌ల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేష‌నల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న హీరోయిన్ గా స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శక‌త్వంలో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పన‌క్క‌ర్లేదు. అల్లు అర్జున్ కేరీర్ లోనే ది బెస్ట్ సినిమాగా పుష్ప నిలిచింది. అంతే కాకుండా బాక్స్ ఆఫీస్ ను బ‌ద్ధ‌లు చేసేలా క‌లెక్ష‌న్లు కూడా వ‌చ్చియి. అయితే ఈ సినిమా లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఒక ప్ర‌త్యేక పాట‌లో చిందు వేసింది.

ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావాస అంటూ సాగే ఈ పాట‌లో స‌మంత డాన్స్ చూసి కుర్ర‌కారు రెచ్చిపోయారు. ఈ పాట కోసమే కొంత మంది ఈ సినిమా రెండు మూడు సార్లు చూసారంటే.. ఈ పాటకు ఉన్న క్రేజ్ ను అర్థం చేసుకోవాలి. అయితే ఆ పాట కోసం స‌మంత డాన్స్ ప్రాకిస్ చేస్తున్నప్పటి ఒక వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఊపెస్తుంది. అంతే కాకుండా ఈ పాట ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. అయితే మీరు కూడా ఈ వీడియో చూసేయండి.