Pushpa: ‘పుష్ప’​ ట్రైలర్​ రిలీజ్​ఎప్పుడో తెలుసా?

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​, సెన్సెష‌న‌ల్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీకి జోడీగా శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన నటిస్తోంది. చిత్రంలో ఫహద్ ఫాసిల్​, సునీల్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మ‌రోవైపు యాంకర్ అన‌సూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనం ఇవ్వ‌నున్న‌ది. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను తిరగ‌రాసింది ఈ మూవీ. ఈ సినిమా మీద మరింత హైప్స్ క్రియేట్ అయ్యేలా ఐటెం సాంగ్​లో సమంత నటించనుండటం విశేషం. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలుకానుందని తెలుస్తోంది.

పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పార్ట్‌ – 1 డిసెంబర్‌ 17న విడుల కానుంది. ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్​ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. ఇప్పటికే అన్ని భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బ‌న్నీ అభిమానులు ఎంతో ఆత్రుత‌గా పుష్ప ట్రైలర్​ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న‌ సమాచారం ప్రకారం.. డిసెంబరు తొలివారంలో పుష్ఫ 1 మూవీ ట్రైలర్ విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ ను ముంబాయిలో చేయాల‌నుకుంటున్నార‌ట‌. అలాగే ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్‌ సింగ్ ను పిలువ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై త్వ‌ర‌లోనే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై త్వ‌ర‌లోనే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.