ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. కాగా బంగాళాకాతంలో అప్పపీడన పరిస్థితులు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. అంతే కాకుండా ఈనెల 27 రెండి రాష్ట్రంలో డిసెంబర్ 4వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కడప,చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది. అంతే కాకుండా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
ఉభయగోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం కర్నూలు జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది స్పష్టం చేసింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండలాని వాతావరణశాక హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. అంతే కాకుండా పలు ప్రాంతాల్లో పంటనష్టం జరిగింది.