నయనతారపై రాధారవి అసభ్యకర వ్యాఖ్యలు, వేటు..!

-

సౌత్ లో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చేలా లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార మీద ఇప్పటివరకు ఎవరు నెగటివ్ కామెంట్స్ చేయలేదు. కాని తమిళ నటుడు రాధారవి మాత్రం అనూహ్యంగా నయనతార మీద తన వ్యంగాస్త్రాలు సంధించాడు. నయనతార నటించిన కొలయుత్తిర్ కాలం సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న రాధారవి నయనతార గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దెయ్యంగానూ.. సీత గాను ఒకేసారి నటించే సత్తా నయనతారకు ఉందని.. ఒకప్పుడు కే.ఆర్ విజయ లాంటి వారికి అలాంటి ఛాన్స్ ఉందని నయనతారను దెప్పిపొడించాడు. అంతేకాకుండా చూపులతో వలలో వేసుకునే వారికి ఇప్పుడు దేవతల పాత్రలు ఇవ్వడానికి దర్శకులు వెనుకడుగు వేయట్లేదని అన్నాడు. రాధారవి వ్యాఖ్యలను ఖండిస్తూ సింగర్ చిన్మయి, వరలక్ష్మి శరత్ కుమార్, దర్శకుడు విఘ్నేష్ శివన్ నడిఘర్ సంఘంపై కామెంట్స్ చేశారు. హీరో విశాల్ జోక్యం చేసుకుని రాధా రవి మాటలు ఆయన కామెంట్స్ ను ఖండిస్తూ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.

మొత్తానికి ఏదో ఆడియో రిలీజ్ కు వచ్చామా వెళ్లామా అన్నట్టు కాకుండా ఇలాంటి కామెంట్స్ చేసి అందరి చేత చీవాట్లు తింటున్నాడు రాధారవి. మరి దీనిపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి. నడిగర్ సంఘం రాధా రవి వ్యవాహారంపై సీరియస్ అయ్యింది. ఎన్నికల టైం కావడం వల్ల రాధా రవి వ్యాఖ్యల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని డి.ఎం.కే పార్టీ నుండి ఆయన్ను సస్పెన్స్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version