సమాజంలో సైకో మెంటాలిటీ ఉంది.. తన లీక్ సీన్‌పై స్పందించిన రాధికా ఆప్టే..!

-

రాధికా ఆప్టే, దేవ్ పటేల్‌లు నటించిన హాలీవుడ్ చిత్రం ది వెడ్డింగ్ గెస్ట్ లోని ఓ లీక్ సీన్‌ ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతుండగా.. దానిపై రాధికా ఆప్టే స్పందించింది.

ప్రముఖ బాలీవుడ్ నటి రాధికా ఆప్టే నటించిన పార్చ్‌డ్ చిత్రం ఒకప్పుడు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అందులో రాధికా పలు నగ్న, శృంగార సన్నివేశాల్లో నటించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ సినిమాలోని ఆమె నగ్న సన్నివేశాలు అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే ఆ వివాదం అప్పటితో ముగిసినా.. ఇప్పుడు మళ్లీ ఆమె నటించిన మరొక సినిమాలోని సీన్లు కూడా వివాదాస్పదం అవుతున్నాయి.

radhika apte responded over her leaked scene

రాధికా ఆప్టే, దేవ్ పటేల్‌లు నటించిన హాలీవుడ్ చిత్రం ది వెడ్డింగ్ గెస్ట్.. ఇప్పటికే హాలీవుడ్‌లో విడుదల కాగా ఇందులోని ఓ సన్నివేశం ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ సీన్‌లో రాధికా, దేవ్‌లు రొమాంటిక్‌గా కనిపిస్తారు. ముద్దులు పెట్టుకుంటారు. ఆ సీన్లో రాధికా.. అర్ధనగ్నంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆ సీన్ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతుండగా.. దానిపై రాధికా ఆప్టే స్పందించింది.

ది వెడ్డింగ్ గిఫ్ట్ సినిమాలో ఉన్న సీన్ లీక్ కావడంపై రాధికా ఆప్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. మన సమాజంలో సైకో మెంటాలిటీ ఏ విధంగా ఉందో ఈ సీన్ లీక్ చెబుతుందని ఆమె అన్నది. అందులో ఉన్న మేల్ యాక్టర్ దేవ్ పటేల్ పేరిట కాకుండా.. తన పేరిట ఆ వీడియోను వైరల్ చేస్తుండడాన్ని ఆమె తప్పు పట్టింది. ఈ సినిమాలో ఎన్నో చక్కని సీన్లు ఉన్నాయని, కానీ వాటిని వదిలేసి ఆ ఒక్క రొమాంటిక్ సీన్‌ను మాత్రమే కొందరు కావాలని లీక్ చేశారని, మన సమాజంలో ఉన్న సైకోటిక్ మెంటాలిటీకి ఇది నిదర్శమని రాధికా వాపోయింది.

ఆ సీన్‌లో తాను, దేవ్ పటేల్ ఇద్దరం ఉన్నా.. కేవలం తన పేరిటే ఆ సీన్‌ను అప్‌లోడ్ చేసి షేర్ చేస్తున్నారని రాధికా మండి పడింది. సినిమాల్లో నగ్న, శృంగార సన్నివేశాల్లో నటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాధికా గతంలో చెప్పగా.. తిరిగి అదే విషయాన్ని ఆమె మరోసారి గుర్తు చేసింది. తాను ప్రపంచ దేశాలు తిరిగానని, అన్ని సినిమాలను చూశానని, సినిమాల్లో బోల్డ్ సీన్లలో నటించే విషయంలో తనకెలాంటి భయం లేదని రాధికా చెప్పుకొచ్చింది. అలాగే విదేశీ నటులు తెరమీద నగ్నంగా నటిస్తారని, అలాంటప్పుడు తన శరీరాన్ని తెరపై చూసి తాను ఎందుకు సిగ్గుపడాలని ఆమె ప్రశ్నించింది. ఈ క్రమంలోనే బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై తాను ఒక క్లారిటీతో ఉన్నానని కూడా రాధికా తెలిపింది. కాగా రాధికా ఆప్టేకు చెందిన ఆ వీడియో ఇప్పుడు గూగుల్ టాప్ ట్రెండ్స్‌లోనూ నంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం..!

Read more RELATED
Recommended to you

Latest news