చంద్రముఖి 2 లో రాఘవ లారెన్స్ .. రజనీ ఇచ్చిన ఆఫర్ కి ఊపిరాడటం లేదట …!

-

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమా చంద్రముఖి. పి. వాసు దర్శకత్వంలో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాతో కోలీవుడ్ కి పరిచయమైంది నయనతార. ఇక ఈ సినిమా సమయంలో ప్రభు కొన్ని ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ విషయం తెలిసిన రజనీకాంత్ ప్రభు నిర్మాతగా చంద్రముఖి తీయమని చెప్పి డైరెక్టర్ వాసు ని పురమాయించారు. అందంతా రజనీకాంత్ కి ప్రభు వాళ్ళ నాన్నగారు శివాజీ గణేషన్ మీద ప్రేమ అభిమానం వల్లనే. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి వాళ్ళు సాధించి రికార్డ్ ని క్రియోట్ చేసింది.

 

ఆ తర్వాత ఇదే సినిమాకి సీక్వెల్ గా విక్టరీ వెంకటేష్ హీరో నాగవల్లి సినిమాని తెరకెక్కించారు పి. వాసు. ఇక్కడ పి.వాసు వెంకటేష్ తో నాగవల్లి సినిమా చేయడానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి చంద్రముఖి సినిమా వెంకటేష్ కి విపరీతంగా నచ్చడం అయితే ఈ సినిమా డైరెక్టర్ పి.వాసు వెంకటేష్ కెరీర్ లో టాప్ టెన్ లో నిలిచిన చంటి సినిమాకి కథ అందించడం. ఈ రెండు కారణాలతోనే వెంకటేష్ నాగవల్లి సినిమాలో నటించాడు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి సినిమాకి తమిళ సీక్వెల్ గా చంద్రముఖి 2 ని రూపొందించనున్నారు. పి వాసు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.

అయితే రజనీ కాంత్ హీరోగా నటించబోతున్న చంద్రముఖి 2 లో ప్రముఖ కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఒక ముఖ్య పాత్రలో నటించడం ఇప్పుడు కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని రాఘవ లారెన్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు రాఘవ లారెన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. ఇక రాఘవ లారెన్స్ ని చంద్రముఖి 2 లో తీసుకోవడానికి ముఖ్య కారణం రజనీకాంత్ కి రాఘవ లారెన్స్ నటిస్తున్న కాంచన ఫ్రాంచైజీ తో ఆకట్టుకోవడమే. ఇక ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను రాఘవ లారెన్స్ రెమ్యూనరేషన్ 5 కోట్లు కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ నుండి అందుకున్న 3 కోట్ల అడ్వాన్స్ మొత్తాన్ని కరోనా బాదితులకి విరాళంగా ప్రకటించి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version