12-12-12 రాజమౌళి మరో సర్ ప్రైజ్..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ట్రిపుల్ ఆర్ మీద అటు మెగా ఇటు నందమూరి అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా ఓపెనింగ్ నుండే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టిన జక్కన్న 11-11-11 అంటూ ముహుర్తం కూడా ఓ మ్యాజిక్ ఫిగర్ గా చేశాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా నుండి మరో సర్ ప్రైజ్ 12-12-12న ఇస్తున్నాడట. 12-12-12 అంటే డిసెంబర్ 12, మధ్యాహ్నం 12 గంటలకు అన్నమాట.

సినిమా నుండి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఇప్పుడు 12-12-12 ఏం రాబోతుంది అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువైంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సినిమాలో హీరోయిన్స్ విషయంపై ఆరోజు క్లారిటీ ఇస్తారేమో అంటున్నారు. ఇక కొందరైతే సినిమా మీద మరింత అంచనాలు పెంచేందుకు ఎన్.టి.ఆర్, చరణ్ కు సంబందించిన ఓ పోస్టర్ రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నారు.

ఏది ఏమైనా బాహుబలి రూట్ లోనే ట్రిపుల్ ఆర్ ప్రతి స్టెప్ లో పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో చరణ్ పోలీస్ గా.. ఎన్.టి.ఆర్ గజదొంగగా కనిపిస్తాడని తెలుస్తుంది. మరి అది ఎంతవరకు వాస్తవం అన్నది సినిమా ఫస్ట్ లుక్ వస్తేనే కాని చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Latest news