బొమ్మరిల్లు సిద్ధార్థ్ విలన్ అవుతున్నాడు

-

నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించిన సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులకు మంచి సుపరిచితుడు. అప్పట్లో కాస్త అతి చేసి క్రేజ్ తగ్గించుకున్నాడు కాని ఇప్పుడున్న స్టార్ హీరోల సరసన చేరే స్టామినా ఉంది అతనికి. తెలుగులో సరిగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ లో నిర్మాతగా మారి ప్రయత్నాలు మొదలు పెట్టాడు సిద్ధార్థ్. అక్కడ పర్వాలేదన్నట్టు కెరియర్ సాగిస్తున్న సిద్ధార్థ్ కు తెలుగు నుండి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది.

తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో ఓ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో విలన్ గా సిద్ధార్థ్ ను సెలెక్ట్ చేశారని టాక్. రీసెంట్ గా గృహం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్ తెలుగులో ప్రతినాయకుడిగా కొత్త ప్రయత్నం చేస్తున్నాడు. సహజ నటులైన నాని, సిద్ధార్థ్ హీరో విలన్ గా నటించడం ఆ ప్రాజెక్ట్ కు క్రేజ్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన మరిన్ని విషయాలు త్వరలో వెళ్లడవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news