ఎన్ని ఫ్రైడేలు.. ఎన్ని ఫస్ట్ షోలు.. అప్పుడే ఇరవై ఏళ్లా : రాజమౌళి ఎమోషనల్‌ పోస్ట్‌

-

‘‘ఎన్ని శుక్రవారాలు.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోలు. అప్పుడే 20 ఏళ్లు గడిచాయా? కలెక్షన్ల పరంగా విజయం అందుకున్నా, అందుకోలేకపోయినా ఇక్కడ చూసిన ప్రతి సినిమా నాకు పాఠం నేర్పింది. అంటూ దర్శకధీరుడు రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరు.. ముఖ్యంగా ప్రతి హైదరాబాద్ వాసి కనెక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన పోస్టు ఏంటంటే..

‘‘ఎన్ని శుక్రవారాలు.. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోలు. అప్పుడే 20 ఏళ్లు గడిచాయా? కలెక్షన్ల పరంగా విజయం అందుకున్నా, అందుకోలేకపోయినా ఇక్కడ చూసిన ప్రతి సినిమా నాకు పాఠం నేర్పింది. డియర్‌ ప్రసాద్స్‌.. నువ్వు నా క్లాస్‌రూమ్‌’’ అంటూ ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ సినిమాస్‌ (మల్టీప్లెక్స్‌) నిర్మితమై ఈ ఏడాది (జులై 25)తో 20 ఏళ్లు పూర్తయింది. ఆ మల్టీప్లెక్స్‌తో తనకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ రాజమౌళి ఎమోషనల్‌ అయ్యారు. ప్రసాద్స్ సినిమాస్ మల్టీప్లెక్స్‌తో ప్రేక్షకుడికి ఉన్న అనుబంధాన్ని చూపించే వీడియో అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news