పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌పై.. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రియాక్షన్ ఇదే

-

ఏపీలో గత మూడేళ్ల(2019-2021)లో 7,918 మంది బాలికలు, 22,278 మంది మహిళలు, యువతుల అదృశ్యమయ్యారని ఇటీవలే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ డిమాండు చేశారు. ఇప్పటికైనా వైసీపీ.. ప్రభుత్వాన్ని మహిళా కమిషన్‌ ప్రశ్నించగలదా? దీనిపై మహిళా కమిషన్‌ విలేకరుల సమావేశం పెట్టగలదా? హోం శాఖను, డీజీపీని వివరణ కోరగలదా?’’ అని పవన్‌ ప్రశ్నించారు.

పవన్‌ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఇవాళ  స్పందించారు. ఏపీలో మహిళల అదృశ్యంపై పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించటం, దానిపై పవన్‌ కల్యాణ్ మళ్లీ స్పందించటం ఏంటని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే రాజ్యసభలో కొందరు ఎంపీలు మహిళల అదృశ్యంపై ప్రశ్నలు అడగటం వెనుక ఏ ఉద్దేశాలు ఉన్నాయని ప్రశ్నించారు.  వాలంటీర్లపై దుష్ప్రచారం చేసేందుకే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. వాలంటీర్ల వల్లే మహిళలు అదృశ్యమవుతున్నారని చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు ఇవ్వాలని ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు ఇచ్చామన్నారు. క్రైమ్‌ కహానీలు అల్లటంలో పవన్‌ కల్యాణ్ ఆరితేరారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news