రాజ‌మౌళి నాకు హెడ్ మాస్ట‌ర్ : రామ్ చ‌ర‌ణ్

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఆర్ఆర్ఆర్ సినిమా వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఆర్ఆర్ఆర్ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7 పాన్ ఇండియా రెంజ్ లో థీయేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌మోష‌న్స్ ను చేస్తున్నారు. తాజాగా త‌మిళ‌నాడులోని చెన్నై న‌గ‌రంలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ రాజ‌మౌళిపై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు.

డైరెక్ట‌ర్ రాజ‌మౌళి త‌న‌కు హెడ్ మాస్ట‌ర్ , ప్రిన్సిప‌ల్ లాంటి వ్య‌క్తి అని రామ్ చ‌ర‌ణ్ అన్నారు. అలాగే రాజ‌మౌళి త‌న‌కు ఒక ప్ర‌త్యేక‌మైన గురువు అని అన్నారు. త‌న కేరీర్ లో మొద‌టి హిట్ సినిమా మ‌గ‌ధీర రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలోనే వ‌చ్చింద‌ని అన్నారు. త‌న‌కు రాజమౌళి యే అన్ని అని అన్నారు. అనంత‌రం యంగ్ టైగ‌ర్ తార‌క్ పై కూడా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు తార‌క్ కు ఒక సంవ‌త్స‌రం వ‌య‌స్సు తేడా ఉంటుంద‌ని తెలిపారు. కానీ తార‌క్ చిన్న పిల్లాడి లా ఉంటాడు.. కానీ సింహం లాంటి వ్య‌క్తి అని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో త‌న‌కు తార‌క్ లాంటి మంచి బ్ర‌ద‌ర్ వ‌చ్చాడ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news